News April 16, 2025
సోనాల: పురుగు మందు తాగి ఒకరి సూసైడ్

సోనాల మండలం సంపత్ నాయక్ తండాకి చెందిన జాదవ్ దేవిదాస్(45) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకి చెందిన దేవదాస్ మద్యానికి బానిసయ్యాడు. భార్య మందలించడంతో మనస్తాపం చెంది వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగాడు. బోథ్ CHCకి అక్కడి నుంచి ADB రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.
Similar News
News April 17, 2025
రోగికి ఆధార్ తప్పనిసరి : ఆదిలాబాద్ DMHO

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తప్పకుండా ఆధార్ కార్డును తీసుకొని వెళ్లాలని ఆదిలాబాద్ DMHO డా.నరేందర్ రాథోడ్ సూచించారు. తద్వారా వ్యాధిగ్రస్థుల సమాచారం అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తామన్నారు. భవిష్యత్తులో రోగికి అందించిన సేవల వివరాలు తెలుసుకోవడానికి సహాయకారిగా ఉంటుందన్నారు. దీని ద్వారా చికిత్సలు అందించడానికి సులువవుతుందన్నారు. ఆరోగ్య, ప్రాథమిక కేంద్రాలకు ఆధార్ తీసుకు వెళ్లాలన్నారు.
News April 17, 2025
ADB: భానుడి ప్రతాపంతో విలవిల్లాడుతున్న జనం

భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ మధ్యాహ్నం 12 గంటలకు నిర్మానుష్యంగా మారాయి. 41 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు రోజుల నుంచి 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News April 17, 2025
ADB: ‘మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి’

జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మహిళా సంఘాల సభ్యులకు ఆడిట్ నిర్వహణ తదితరాంశాలపై శిక్షణ తరగతులను బుధవారం నిర్వహించారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్న మాట్లాడారు. మహిళా సంఘాల పుస్తకాలను పారదర్శకంగా ఆడిట్ నిర్వహిస్తూ వారి బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సూచించారు.