News August 19, 2024
సోనూసూద్ సాయం.. అమలాపురం కుర్రోడు అమెరికాకు

సినీ నటుడు సోను సూద్ అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయంతో అమలాపురం టౌన్‌కు చెందిన విద్యార్థి పిల్లాడి మధుకృష్ణ చంద్రబాబు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాడు. పంజాబ్‌లోని లూథియానా సిటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ చేశాడు. తద్వారా జే-వన్ వీసాపై హాస్పిటాలిటీ స్టూడెంట్ ఎక్సేంజ్ విజిటర్‌గా 12నెలలు అమెరికా వెళ్లనున్నాడు. కాగా అతను చిరు వ్యాపారి కుమారుడు.
Similar News
News November 23, 2025
సత్యసాయి సేవలు విశ్వవ్యాప్తం: కలెక్టర్ కీర్తి

తల్లికిచ్చిన మాట కోసం పుట్టపర్తి నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించిన మహనీయుడు సత్యసాయి అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కొనియాడారు. ఆదివారం ఆర్కాట్ తోటలోని సత్యసాయి సేవా సమాజంలో జరిగిన శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రేమ, సేవా భావంతో బాబా చూపిన మార్గం నేటి సమాజానికి ఆదర్శమని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
News November 23, 2025
‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.