News April 16, 2025

సోన్: ‘గల్ఫ్‌లో యువకుడి హత్య.. MLA ఏలేటి భరోసా

image

సోన్‌కు చెందిన హస్తం ప్రేమసాగర్ దుబాయ్‌లో హత్యకు గురయ్యారు. మృతదేహం అక్కడే ఉండిపోయింది. బాధిత కుటుంబానికి MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, నాయకులు జరిగిన ఘటనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఇది సాధ్యమైందని వారు పేర్కొన్నారు.

Similar News

News October 27, 2025

రాజమండ్రి: ఇంటర్ విద్యార్థులకు గమనిక

image

ఇంటర్ విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించాలసి ఉంటుందని ఆర్ఐవో NSVL నరసింహం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్, రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులంతా తమ పరీక్ష ఫీజును ఈ గడువులో చెల్లించాలని చెప్పారు. గడువు దాటితే రూ.1000 ఫైన్‌తో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

News October 27, 2025

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: ఎంపీ

image

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా గత ఐదు, పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో గన్ కల్చర్ పెరిగిపోవడం దురదృష్టకరమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దన్నారు.

News October 27, 2025

NZB: ‘లక్కీ’ డ్రా లో 18 మంది మహిళలకు వైన్స్‌లు

image

నిజామాబాద్ జిల్లాలోని 102 మద్యం షాపులకు సోమవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సారధ్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో 18 మంది మహిళలకు వైన్స్‌లు వరించాయి. గెజిట్ సీరియల్ నం.NZB-5, 7, 9, 16, 22, 50, 53, 57, 65, 69, 71, 78, 79, 82, 85, 86, 88, 97 షాపులు డ్రాలో మహిళలకు దక్కాయి. ఇందులో ఒక మహిళకు సాటాపూర్-1, పోతంగల్ షాపులు దక్కడం విశేషం.