News April 28, 2024
సోన్: తండ్రిని చంపిన కేసులో కొడుకు అరెస్ట్

తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న తండ్రిని చంపిన హత్య కేసులో నిందితుడైన కొడుకు సాయిలును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సోన్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. మాదాపూర్ గ్రామానికి చెందిన నడిపి ఎల్లయ్యకు శనివారం రాత్రి భార్య చిన్నక్క అన్నం పెట్టడం ఆలస్యం కావడంతో కర్రతో కొట్టాడు. తల్లిని చిత్రహింసలకు గురిచేయడాన్ని తట్టుకోలేక సాయిలు తండ్రిని కొట్టి చంపాడు.
Similar News
News October 26, 2025
ఆదిలాబాద్: ‘31లోగా బోర్డుకు ఫీజు చెల్లించాలి’

ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల నుంచి గుర్తింపు ఫీజు (రూ. 220), గ్రీన్ ఫండ్ ఫీజు (రూ.15) కలిపి మొత్తం రూ.235ను ఈనెల 31 లోగా చెల్లించాలని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ప్రిన్సిపల్లు tgbie.cgg.gov.in పోర్టల్ ద్వారా చెల్లింపులు చేయాలని ఆయన ఆదేశించారు. సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 26, 2025
NPA, స్త్రీ నిధిపై ADB కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్లో APM, DPMలతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజి, NPAల తగ్గింపు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, స్త్రీ నిధి పురోగతిపై ప్రధానంగా చర్చించారు. కౌమార సభ్యుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్ పాల్గొన్నారు.
News October 26, 2025
ఈ నెల 27న ఆదిలాబాద్లో జాబ్ మేళా

ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. అర్హులైన 17 నుంచి 25 ఏళ్ల పురుష అభ్యర్థులు (BSC/B.Com/B.A/M.P.C/B.i.P.C/MLT) ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9154679103, 9963452707 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.


