News February 8, 2025

సోన్: నిజాయితీని చాటుకున్న ఉపాధ్యాయులు

image

నిర్మల్ మండలం కౌట్ల (కె) గ్రామానికి చెందిన గురుకుల ఉపాధ్యాయులు భూమేష్, శ్రీధర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం వారు సోన్ వైపు వెళ్తుండగా వారికి ఓ పర్సు దొరికింది. అందులో ఉన్న రూ.5000 ఉన్నాయి. ఆధార్ కార్డు ఆ పర్సు ఎవరిదో కనుక్కొని సదరు మహిళకు అందజేశారు. 

Similar News

News February 9, 2025

మెదక్: కెనడా వెళ్లేందుకు సిద్ధం.. అంతలోనే ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన యువకుడు అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మరాజుపల్లికి చెందిన శ్రీవర్ధన్ రెడ్డి (24) ఇటీవల డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏ చేసేందుకు కెనడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News February 9, 2025

రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

image

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

News February 9, 2025

సిద్దిపేట: జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థినులు

image

గత నెలలో తూప్రాన్‌లో నిర్వహించిన SGF అండర్‌ 14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నంగునూరు మండలం గట్ల, మల్యాల విద్యార్థినిలు ఈశ్వరి, అను జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను హెచ్ఎం రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ అభినందించారు. వారు మాట్లాడుతూ 13 నుంచి 16 వరకు మహారాష్ట్రలో జరిగే పోటీల్లో ఈశ్వరి, అను పాల్గొంటారని తెలిపారు.

error: Content is protected !!