News February 8, 2025
సోన్: నిజాయితీని చాటుకున్న ఉపాధ్యాయులు

నిర్మల్ మండలం కౌట్ల (కె) గ్రామానికి చెందిన గురుకుల ఉపాధ్యాయులు భూమేష్, శ్రీధర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం వారు సోన్ వైపు వెళ్తుండగా వారికి ఓ పర్సు దొరికింది. అందులో ఉన్న రూ.5000 ఉన్నాయి. ఆధార్ కార్డు ఆ పర్సు ఎవరిదో కనుక్కొని సదరు మహిళకు అందజేశారు.
Similar News
News March 19, 2025
MBNR: CMకు ‘THANK YOU’ తెలిపిన ఎమ్మెల్యేలు

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిఅవకాశాలను పెంచేందుకు రూ.6000 కోట్ల రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. MLAలు మధుసూదన్ రెడ్డి, పర్నికా రెడ్డి, మేఘారెడ్డి, ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.
News March 19, 2025
జగిత్యాల: పట్టాల రద్దు.. స్వచ్ఛందంగా భూములు అప్పగించిన రైతులు

జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లో అసైన్డ్ భూముల వ్యవహారంలో 13 ఎకరాల 21 గుంటల అక్రమ పట్టాలను రద్దు చేశారు. 90 ఎకరాలకు పైగా భూమి చట్ట విరుద్ధంగా పట్టా పొందినట్లు తహశీల్దార్ నివేదికలో వెల్లడైంది. దీంతో కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలతో 15 మందికి నోటీసులు ఇచ్చారు. 13.21 ఎకరాలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. ముగ్గురు రైతులు స్వచ్ఛందంగా 3.15 ఎకరాలను అప్పగించారు.
News March 19, 2025
MBNR: రూ.5లక్షలతో నాణ్యమైన ఇందిరమ్మ ఇళ్ల: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శిక్షణ పొందిన మేస్త్రీలు రూ.5లక్షల బడ్జెట్లో నాణ్యతగా ప్రభుత్వం రూపొందించిన డిజైన్ ప్రకారం లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించాలని కలెక్టర్ విజయేందిరబోయి సూచించారు. జిల్లా కేంద్రంలోని NAACలో హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో మేస్త్రీలకు ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన శిక్షణ ముగింపు మంగళవారం నిర్వహించిన సమావేశంలో శిక్షణ పొందిన 14 మంది మేస్త్రీలకు సర్టిఫికెట్లు అందజేశారు