News February 18, 2025

సోన్: పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

image

పది తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా లిఫ్ట్ పోచంపాడ్‌లోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ పాఠశాలలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని, మంచి మార్కులతో ఉత్తీర్లు కావాలని పలు సూచనలు చేశారు. వీరి వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 16, 2025

ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లా కేంద్రంలోని ఐడిఓసీ కార్యాలయంలో బుధవారం జరిగే ప్రజాపాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉదయం 10 గంటలకు ముఖ్య అతిథి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది సమయానికి హాజరు కావాలని ఆదేశించారు.

News September 16, 2025

కొడంగల్: 3న కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.!

image

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 3న కొడంగల్‌కు రానున్నారు. సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాల తర్వాత కొడంగల్ వెళ్లడం ఆయన ఆనవాయితీగా చేసుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి మాటామంతి, నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు సమాచారం.

News September 16, 2025

భద్రకాళి ఆలయంలో హుండీల లెక్కింపు

image

వరంగల్ భద్రకాళి ఆలయంలో హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో ఆలయానికి రూ. 61,58,999 ఆదాయం లభించింది. నగదుతో పాటు 316 యూఎస్‌ఏ డాలర్లు, 15 యూఏఈ దిరమ్స్‌తో పాటు ఇతర విదేశీ కరెన్సీ కూడా వచ్చాయి. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.