News February 18, 2025
సోన్: పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

పది తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా లిఫ్ట్ పోచంపాడ్‌లోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ పాఠశాలలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని, మంచి మార్కులతో ఉత్తీర్లు కావాలని పలు సూచనలు చేశారు. వీరి వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 19, 2025
నేడే రాష్ట్ర బడ్జెట్..KMR జిల్లా ప్రజల బడ్జెట్‌పై ఆశలు..!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల లేమితో సంవత్సరాల తరబడి ప్రాజెక్టుల పనులు పూర్తికావడం లేదు. శతాబ్దాల చరిత్ర కలిగిన కౌలాస్ కోట మరుగున పడి చరిత్రలో కలిసిపోవడానికి రెడీగా ఉంది. అలాగే కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు నిధుల గండం పడుతోంది. బడ్జెట్‌లో వీటిపై ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందో చూడాలి.
News March 19, 2025
NZB: నేడే బడ్జెట్.. జిల్లాకు కావాలి నిధులు

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బుధవారం ఉదయం ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. అలాగే గోదావరి పరివాహ ప్రాంతాల అభివృద్ధితో పాటు ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. మరి బడ్జెట్ కేటాయింపు ఎలా ఉండనుందో.?
News March 19, 2025
క్రికెట్ పోటీల్లో గాయపడ్డ MLA విజయ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రికెట్ పోటీలలో సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా క్రింద పడిపోవడంతో గాయాలపాలయ్యారు. వెంటనే ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.