News February 3, 2025

సోన్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండలంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. పాక్‌పట్ల గ్రామానికి చెందిన నరసయ్య (48) తన పంట చేనుకు నీరు పెట్టడానికి సోమవారం ఉదయం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News November 20, 2025

ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

image

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.

News November 20, 2025

పరకామణి కేసుపై తర్జనభర్జన..?

image

హైకోర్టు ఆదేశాలతో తిరుమల శ్రీవారి పరకామణి కేసు విచారణను CID బృందం వేగవంతం చేసింది. పరకామణి చోరీపై మరోసారి తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని TTD బోర్డు నిర్ణయించింది. హైకోర్టు పరిశీలనలో ఉన్న కేసుపై మరోసారి కేసు ఎలా నమోదు చేయాలని పోలీసుల తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. కేసును పోలీసులకు ఇవ్వాలా? లేదా హైకోర్టుకు నివేదించాలా? లేదా CIDకే మరోసారి ఫిర్యాదు చేయాలా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

News November 20, 2025

తప్పుల సవరణకు ఈ ఒక్కరోజే ఛాన్స్!

image

TG: గ్రామ పంచాయతీలు, వార్డు ఓటరు జాబితాలో <<18333411>>తప్పులు<<>> ఉంటే సవరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పొరపాట్ల సవరణకు ఈ ఒక్కరోజు మాత్రమే ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 22న జిల్లా పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని SEC పేర్కొంది. 23న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. https://tsec.gov.in/లోకి వెళ్లి మీ పేరును చెక్ చేసుకొని తప్పులుంటే GPలో సంప్రదించాలి.