News February 3, 2025
సోన్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండలంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. పాక్‌పట్ల గ్రామానికి చెందిన నరసయ్య (48) తన పంట చేనుకు నీరు పెట్టడానికి సోమవారం ఉదయం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News January 22, 2026
DGEMEలో ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్(DGEME) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.indianarmy.nic.in/
News January 22, 2026
ట్రంప్ విమర్శలపై మోదీ మౌనం వెనక మతలబిదీ..!

ప్రపంచ నేతలను ట్రంప్ ఎడాపెడా వాయించేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, కెనడా PM కార్నీ, UK PM స్టార్మర్.. ఇలా స్థాయి, హోదా చూడకుండా కఠిన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితిని ఊహించే మన ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ చేసిన ఏ విమర్శలకూ స్పందించలేదు. మౌనం పాటిస్తూ ఆయన వలలో పడకుండా చూసుకున్నారు. మోదీ ఈ హుందాతనం వల్లే ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే సాహసం ట్రంప్ చేయలేదు.
News January 22, 2026
KMR: జనసేన పార్టీలో చేరికలు

కామారెడ్డి 8వ వార్డుకు చెందిన వివిధ పార్టీల యువకులు జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ సమక్షంలో, సీనియర్ నాయకుడు లక్ష్మీ నర్సాగౌడ్ ఆధ్వర్యంలో వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సైనికులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


