News March 11, 2025

సోమందేపల్లిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

image

సోమందేపల్లిలోని పాతఊరులో మంగళవారం విద్యార్థిని పూజిత (15) ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఈడిగ సురేశ్, సుధారాణిల కుమార్తె పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం విద్యార్థి ఇంటిలో ఉరేసుకుని మరణించింది. విద్యార్థి తన చావుకు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు నాన్న అని రాసి ఉన్న లెటర్‌ను ఎస్ఐ రమేశ్ బాబు, ఏఎస్ఐ మురళి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 6, 2025

రంగారెడ్డి: FREE కోచింగ్.. నేడే లాస్ట్!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. సీసీటీవీ కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19- 45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, 4 ఫొటోలతో ఈనెల 6లోగా దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 8500165190కు సంప్రదించాలన్నారు. #SHARE IT.

News December 6, 2025

దొరవారిసత్రం PSలో పోక్సో కేసు.. ముద్దాయికి 3 ఏళ్ల శిక్ష.!

image

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని కృష్ణాపురంలో జరిగిన పోక్సో కేసులో కల్లెంబాకం సుమన్‌కు నెల్లూరు పోక్సో కోర్టు 3 సంవత్సరాల కఠిన జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించింది. బాధితురాలిని 2022 డిసెంబర్ 6న కత్తితో బెదిరించి అక్రమంగా తాకిన ఘటనపై Cr.No.79/2022 కింద కేసు నమోదు కాగా.. 354(A), 506 IPC- POCSO సెక్షన్ 7 r/w 8 కింద నేరం రుజువైంది.

News December 6, 2025

40 ఏళ్లు వచ్చాయా? ఈ అలవాట్లు మానేస్తే బెటర్

image

40 ఏళ్లు దాటిన తర్వాత ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరానికి సరిపడవు. చిప్స్, కేక్స్, కుకీస్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. ఒత్తిడితో కార్టిసాల్‌ విడుదలై హై బీపీ, షుగర్, మెమొరీ లాస్‌కు కారణమవుతుంది. స్క్రీన్ ఎక్కువ చూస్తే గుండె జబ్బులు, మధుమేహ సమస్యల ప్రమాదం ఉంటుంది. స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా బ్లడ్, థైరాయిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.