News April 1, 2025
సోమందేపల్లిలో ఘర్షణ.. ఒకరి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సాయినగర్‌లో మంగళవారం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అప్పు వ్యవహారంలో బావ మారి, బావమరిది నారాయణ ఘర్షణకు దిగారు. మారీ కర్రతో దాడి చేయడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘర్షణలో మృతుడు నారాయణ అన్న అంజికి గాయాలలైనట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News January 3, 2026
పోలవరం: జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు

పోలవరం జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వై.రామవరం మండలంలోని డొంకరాయి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ చరణ్ నాయక్ వాహన తనిఖీలు నిర్వహించారు. రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ శివ కుమార్, జడ్డంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ చినబాబు వాహన తనిఖీలు చేసి రికార్డులు సక్రమంగా లేనివారికి జరిమానాలు విధించారు.
News January 3, 2026
మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియ నిర్వహణ వేగవంతం చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 52 శాతమే పూర్తి చేశారని, ప్రక్రియను మరింత వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలన్నారు.
News January 3, 2026
CBN, లోకేశ్ విదేశీ పర్యటనలపై అనుమానాలు: కాకాణి

AP: CM CBN, లోకేశ్ రహస్య విదేశీ పర్యటనలపై అనేక సందేహాలు వస్తున్నాయని YCP నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రజల దృష్టి మళ్లించేందుకు రహస్య ప్రదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. పెట్టుబడులపై ఫోర్బ్స్ నివేదిక అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. MOUలతోనే పెట్టుబడులు వచ్చేసినట్లు చెబుతున్నారు’ అని విమర్శించారు. అనుకూల మీడియాకూ వారెక్కడున్నారో తెలియదంటే ఏదో జరుగుతోందన్న అనుమానాలున్నాయని చెప్పారు.


