News April 11, 2024
సోమల: భర్తను ప్రియుడితో కలసి హత్య చేసిన నిందితురాలి అరెస్టు

భర్తను హత్య చేసి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పరారీలో ఉన్న భార్యను అరెస్ట్ చేసి చిత్తూరు ఏడీజే కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు SI వెంకట నరసింహులు తెలిపారు. 2018లో సోమల(M), ఆవులపల్లెకు చెందిన గోవిందప్ప(35)ను భార్య కుమారి, ప్రియుడు వెంకటరమణతో కలిసి రోకలి బండతో కొట్టి హతమార్చింది. కుమారి రిమాండుకు వెళ్లివచ్చిన తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు.
Similar News
News December 1, 2025
6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.
News December 1, 2025
చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు

చిత్తూరు జిల్లాలో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 2023-24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024-25 నాటికి అదే శాతం ఉంది. 2025-26లో 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47,454 మందిని పరీక్షించగా.. 168 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే 22,430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
News November 30, 2025
చిత్తూరు: సిబ్బంది అందుబాటులో ఉండాలి

తుఫాను నేపథ్యంలో సిబ్బంది అందరూ ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. 14 మండలాలలో 168 గ్రామాలలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.


