News January 12, 2025

సోమవారం ఎవరూ రావద్దు: ప్రకాశం ఎస్పీ

image

భోగి సందర్భంగా 13న జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టం” కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయప్రయాసలు పడి ఈ నెల 13న జిల్లా పోలీసు కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.

Similar News

News February 16, 2025

విద్యార్థులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి: ఎస్పీ

image

విద్యార్థులు తమ సామర్థ్యాలకు అనుగుణంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఆదివారం ఒంగోలులో జరిగిన బాలోత్సవం కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి స్థాయి నుండే బాలలు మంచి అలవాట్లతో, ఒత్తిడి లేని విధానంలో అభివృద్ధి చెందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు

News February 16, 2025

ప్రకాశం: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

image

పల్నాడు జిల్లా నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతిచెందిన విషయం తెసిందే. హైదరాబాద్ నుంచి మద్దిపాడుకు వస్తుండగా లారీ, కారును ఢీకొట్టింది. తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

News February 16, 2025

ప్రకాశం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పల్నాడు జిల్లా రాజుపాలెం(M) నెమలిపురి దగ్గర అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!