News January 28, 2025
సోమవారం నుంచి మున్సిపాలిటీగా స్టేషన్ ఘనపూర్

అభివృద్ధిలో ముందుకు పోతున్న నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ ఘనపూర్ సోమవారం నుంచి మున్సిపాలిటీగా అధికారికంగా అమల్లోకి వచ్చింది. స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీగా ప్రకటిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కే.శ్రీదేవి నేడు జీవో విడుదల చేశారు. స్టేషన్ ఘనపూర్, శివునిపల్లి, చాగల్లు గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. మూడు గ్రామాల జనాభా 23,033గా ఉంది.
Similar News
News February 19, 2025
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.
News February 19, 2025
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని విజయనగరంలో ఆందోళన

ఈనెల 23న జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని విజయనగరంలో అభ్యర్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోస్టర్ విధానంపై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో తీర్పు వెలువడిన తర్వాతే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. తక్షణమే పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులు నష్టపోతారన్నారు. కేసులన్నీ పరిష్కరించి ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కోట జంక్షన్ వరకు ర్యాలీ చేశారు.
News February 19, 2025
ADB: అప్పుల బాధతో రైతు సూసైడ్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.