News March 29, 2025
సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 31న రంజాన్ పండుగ సందర్భంగా పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు, అధికారులందరూ గమనించాలని ఆయన కోరారు.
Similar News
News July 11, 2025
KNR ఆర్టీసీ జోనల్ హాస్పిటల్ లో అందుబాటులోకి ఎక్స్ రే సేవలు

ఆర్టీసీ KNR జోనల్ ఆస్పత్రిలో ఎక్స్ రే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా. ఎ.వి గిరిసింహారావు మాట్లాడుతూ.. నిత్యం రోడ్డు మీద ప్రయాణించే డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్, వర్క్ షాపు సిబ్బంది గాయాల బారిన పడుతుంటారని అన్నారు. వాటిని నిర్ధారించడానికి ఎక్స్ రే ఉపయోగపడుతుందని అన్నారు. ఉన్నత శ్రేణి డిజిటల్ ఎక్స్ రే మెషీన్ ని అందించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
News July 11, 2025
తిమ్మాపూర్: ‘కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’

బెజ్జంకికి చెందిన కోటారి భానుప్రసాద్(19), నరేష్‌తో కలిసి బైక్‌పై కరీంనగర్ వెళ్లి తిరుగు ప్రయాణంలో గురువారం తెల్లవారుజామున <<17014948>>రేణికుంటలో<<>> రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సాయిబాబా గుడి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాద ఘటనపై భాను ప్రసాద్ తల్లి రేణుక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢీకొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
News July 11, 2025
ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్స్‌కు భలే ఛాన్స్

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇటలీలో 1,67,333 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఈ క్రమంలో హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా.