News February 1, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించుటకు కలెక్టరేట్ కు రావద్దని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
పాలమూరు: వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ పదవికి పోటీ

కొత్తకోట మండలం రామనంతపూర్లో మొత్తం 8 వార్డులున్నాయి. రెండో విడత నామినేషన్లో భాగంగా సర్పంచ్ పదవికి ఆరుగురు, వార్డు మెంబర్లకు 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏకగ్రీవంగా చేసి, నిధులతో దేవాలయం నిర్మించాలని తీర్మానించగా, నలుగురు అభ్యర్థులు తప్పుకున్నారు. కానీ యాదగిరిరెడ్డి, శివుడు పోటీ నుంచి తప్పుకోకపోవడంతో ఏకగ్రీవ చర్చలు విఫలమయ్యాయి. వార్డు మెంబర్లను మాత్రం ఏకగ్రీవం వరించింది.
News December 8, 2025
హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!

వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా UIDAI కొత్త రూల్ తీసుకురానుంది. QR కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది. ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది. యూజర్ల ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకు UIDAI ఈ దిశగా అడుగులేస్తోంది. దీంతో ఓయో, ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది.
News December 8, 2025
పల్నాడు: కమ్మేసిన పొగ మంచు

పల్నాడు ప్రాంతాన్ని మంచు దుప్పటి దట్టంగా కమ్మేయడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు కూడా సరిగా కనపడటం లేదు. దట్టమైన మంచు తరచూ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇటీవల చిలకలూరిపేట వద్ద మంచు కారణంగా వాహనం కనిపించక జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మంచు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


