News February 23, 2025

సోమవారం ప్రజావాణి రద్దు: ADB కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం 24న తేదిన ప్రజావాణి రద్దు చేసినట్లు ADB జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం, ఎన్నికలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.

Similar News

News October 18, 2025

పత్తి కొనుగోళ్లు, కౌలు రైతు నమోదుపై ADB కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

News October 17, 2025

ADB: డబ్బులు వసూలు చేసిన ప్రిన్సిపల్ రిమాండ్

image

ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి డబ్బులు వసూలు చేసిన బోథ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కోవ విఠల్‌ను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. అనంతా సొల్యూషన్‌ సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తానని 45 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఓ నిరుద్యోగి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

News October 16, 2025

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ డీపీఆర్ఓగా విష్ణువర్ధన్

image

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా ఎల్చల విష్ణువర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజార్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పౌర సంబంధాల విభాగం పనితీరు మరింత ప్రభావవంతంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు.