News February 23, 2025

సోమవారం ప్రజావాణి రద్దు: ADB కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం 24వ తేదిన ప్రజావాణి రద్దు చేసినట్లు ADB జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం, ఎన్నికలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.

Similar News

News March 23, 2025

ఆదిలాబాద్‌: రేపటి నుంచి 6రోజుల పాటు శిక్షణ

image

ఆదిలాబాద్‌లోని TTDCలో విపత్తు నిర్వహణపై ఈ నెల 24 నుంచి 29 వరకు మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18 నుంచి 40 సం.రాల వయస్సు లోపు పది పాసైన 50 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టిఫిన్, భోజనం ఖర్చులకు వంద రూపాయలతో పాటు రాత్రి వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 23, 2025

ADB: ఇంటివద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

image

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఆదిలాబాద్ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. శనివారం ఆమె కౌంటర్‌ను ప్రారంభించారు. భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే కార్గో సేవల ద్వారా మీ ఇంటి వద్దనే తలంబ్రాలు అందజేస్తామన్నారు.

News March 23, 2025

ADB: కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

image

ఆదిలాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని, కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న కేసులపై ఆయన ఆరా తీశారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. కమాండ్ కంట్రోల్స్, సీసీ కెమెరాల తీరును పర్యవేక్షించారు. అంతకుముందు ఎస్పీకి డీఎస్పీ జీవన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

error: Content is protected !!