News August 10, 2024
సోమశిలకు రోజురోజుకి పెరుగుతున్న వరద
సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి శనివారం ఉదయం 6 గంటలకు 11,290 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ ఈఈ దశరథ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 15.733 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 17, 18 స్లూయిస్ ద్వారా పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 85 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నట్లు తెలిపారు.
Similar News
News November 18, 2024
నెల్లూరు: ‘ఎక్కువ రేట్లకు మద్యం అమ్మితే చర్యలు’
నెల్లూరు జిల్లాలో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టీ.శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లాలో అధిక ధరలకు మద్యం విక్రయాలపై ఆయన స్పందించారు. వ్యాపారులు MRP కన్నా ఎట్లక్కువ రేకు మద్యం అమ్మితే రూ.5లక్షల ఫైన్ విధిస్తామన్నారు. షాపుల్లో ధరల బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే 9440902509, 8374684689 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
News November 18, 2024
నెల్లూరు: లా విద్యార్థిని సూసైడ్
కోవూరులో ఓ లా విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోవూరుకు చెందిన లాయర్ శ్రీనివాసులు కుమార్తె శ్రీలత(25) నెల్లూరులో లా చదువుతోంది. శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కోవూరు SI రంగనాథ్ గౌడ్ తెలిపారు.
News November 18, 2024
ఫిర్యాదులకు ఆధార్ తప్పనిసరి: నెల్లూరు SP
నెల్లూరు SP కార్యాలయం కీలక ప్రకటన చేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రజలు నేరుగా అర్జీలు ఇస్తున్నారు. నేటి నుంచి జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చే ప్రజలు కచ్చితంగా తమ వెంట అర్జీ(ఫిర్యాదు పత్రం)తో పాటు ఆధార్ కార్డు తీసుకు రావాలని ఎస్పీ జి. కృష్ణకాంత్ సూచించారు. ఈ మార్పును ప్రజలు గమనించాలని కోరారు.
Share It.