News October 19, 2024
సోమశిల జలాశయం నేటి తాజా సమాచారం

సమస్యల జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి 32,668 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 57.981 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి కండలేరు రిజర్వాయర్ కు 10 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News February 25, 2026
వలేటివారిపాలెం: జనార్ధన స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు

వలేటివారిపాలెం – చుండి మధ్య 167బి జాతీయ రహదారి పక్కనే ఉన్న జనార్ధన స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయ పక్కన ఉన్న మండపంలో సుమారు 10 అడుగుల లోతున గుంత తీయడం స్థానికంగా కలకలం రేపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు రెండు మూడు సార్లు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చారిత్రక దేవాలయాలను కాపాడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
News February 25, 2026
ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల కేంద్రాలను కలెక్టర్ హిమాన్సు శుక్లా తనిఖీ చేశారు. నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు ఆయన సూచించారు. విద్యార్థుల సందేహాల కొరకు ఐఆర్‌ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.