News August 25, 2024

సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం సాగేనా!

image

జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణా నది ప్రస్తుతం నిండుకుండలా ఉంది. కృష్ణమ్మ నిశ్శబ్దం ఒడిలో ప్రకృతి జలపాతాల అందాలు, పరివాహ ప్రాంత అటవీ అందాలు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణం పర్యాటకుల మదిలో మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఈ ప్రయాణానికి పర్యాటకులు ఎంతగానో ఆసక్తి చూపుతారు. పర్యాటక శాఖకు ఆదాయం కూడా జమవుతుంది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటక శాఖ లాంచీ ప్రయాణం కొనసాగించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Similar News

News January 17, 2026

బతుకమ్మ చీరలు చేలల్లో కట్టడానికే పనికొచ్చినయ్: CM

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు పట్టుకునేందుకు పనికి రాలేదని చేన్లలో పందులు రాకుండా అడ్డుకునేందుకు పనికి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఆగం చేశారన్నారు.

News January 17, 2026

MBNR: చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవు: కె.ప్రవీణ

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఫార్మసీ కాలేజీలో కొనసాగుతున్న బీ-ఫార్మసీ V &VII సెమ్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికాణి డాక్టర్ కే.ప్రవీణ పరిశీలించారు. చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవని, అదేవిధంగా పరీక్ష హాలులో ఏమైనా సమస్యలుంటే చీప్ సూపరింటెండెంట్ దృష్టికి తేవాలని అన్నారు. చీప్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కాంత్ పాల్గొన్నారు.

News January 17, 2026

దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్‌లు తెలంగాణా నుండే రావాలి- CM

image

దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి గ్రామంలో త్రిబుల్ ఐటీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు.