News February 20, 2025
సోమశిల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేత

సోమశిల ప్రాజెక్టు నుంచి గత 2 రోజులుగా 6 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగింది. అయితే, పెరిగిన నీటి ప్రవాహం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించిన అధికారులు ఇవాళ ఉదయం 6 క్రస్ట్ గేట్లను మూసివేశారు. దీంతో నీటి విడుదల పూర్తిగా నిలిపివేయబడింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ, భవిష్యత్ చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు.
Similar News
News December 13, 2025
నెల్లూరు: నిన్న అనిల్ పక్కన.. నేడు మంత్రి నారాయణ పక్కన..!

నిన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పక్కన విలేకరుల సమావేశంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఇవాళ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 37వ డివిజన్ కార్పొరేటర్, నెల్లూరు నగర YCP అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ TDP కండువా కప్పుకున్నారు. కాగా.. నిన్న మంత్రి నారాయణ, MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసి అనిల్ కుమార్ మాట్లాడారు. ఇది జరిగిన 24 గంటల్లోనే అనిల్ రైట్ హ్యాండ్ శ్రీనివాస్ యాదవ్ TDPలో చేరడం కొసమెరుపు.
News December 13, 2025
నేడు కాణిపాకంలో నెల్లూరు కార్పొరేటర్ల ప్రమాణం.?

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఘట్టం <<18549066>>వైకుంఠపాళి<<>>ని తలపిస్తోంది. అవిశ్వాసాన్ని నెగ్గించాలని TDP, అడ్డుకోవాలని YCP పావులు కదుపుతున్నాయి. పలువురు కార్పొరేటర్లు ‘<<18540168>>జంపింగ్ జపాంగ్<<>>’లా మారారు. ఎలాగైనా తమ కార్పొరేటర్లను కాపాడుకోవాలని TDP వారిని తిరుపతి తరలించిందట. మరికాసేపట్లో వారిని కాణిపాకం తరలించి ‘మేము TDPలోనే కొనసాగుతాం’ అని ప్రమాణం చేయించనున్నారట.
News December 13, 2025
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

హ్యాండ్లూమ్, టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్కు సంబంధించిన పరీక్షలను జనవరిలో నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా ఆయా విభాగాలకు సంబంధించిన నిర్దేశించిన ఫీజులను ఆన్లైన్ ద్వారా చెల్లించాలని కోరారు.


