News July 25, 2024
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై 12 కేసులు
గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్యేలపై వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద 12 కేసులు పెట్టి 2 సార్లు అరెస్టు చేశారు. పొంగూరు నారాయణ మీద 8 కేసులు పెట్టి ఒకసారి అరెస్టు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై 3 కేసులు పెట్టి ఒకసారి అరెస్టు చేశారు.
Similar News
News January 18, 2025
నెల్లూరు: వైభవంగా రాపత్తు ఉత్సవాలు
నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో రాపత్తు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం దేవేరుల సమేత రంగనాథుడికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రంగనాథస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
News January 17, 2025
‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’
76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News January 17, 2025
2 నెలల పాటు అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేత
రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల పాటు అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు జిల్లా రిజిస్టర్ బాలాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు.