News July 28, 2024

సోమిరెడ్డి పై విచారణ జరిపించాలి: కాకాని

image

సీఎం చంద్రబాబు తమపై విచారణ జరిపించడంతో పాటు, సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకుపై కూడా విచారణ జరిపించేందుకు సిద్ధంకావాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. SNJ డిస్టీలరీస్‌ను సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రారంభించారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ ప్రభుత్వంలోనే ఇది ప్రారంభమైందన్నారు. ఎవరు లైసెన్స్ ఇచ్చారనే విషయాన్ని సోమిరెడ్డి తెలుసుకోవాలన్నారు.

Similar News

News October 12, 2024

వింజమూరు: రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ ఉద్యోగి మృతి

image

వింజమూరు మండలంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉదయగిరికి చెందిన APGB బ్యాంక్ ఉద్యోగి షేక్ ఖాజా రహంతుల్లా చనిపోయాడు. చాకలికొండలోని APGB బ్యాంకులో విధులు ముగించుకొని వస్తుండగా మార్గమధ్యలో గేదె అడ్డు వచ్చింది. దీంతో గేదెను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.

News October 11, 2024

తడ: ఓ ప్రైవేట్ కంపెనీలో మహిళ దారుణ హత్య..?

image

తడ మండలం మాంబట్టు సెజ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. కంపెనీలో పని చేస్తున్న మహిళను తోటి వర్కర్ కత్తెరతో తల, గొంతుపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమెను చెన్నైకి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 11, 2024

చిల్లకూరులో కన్న తల్లిని కడతేర్చిన కొడుకు

image

కన్న తల్లిని కన్న కొడుకే కడతేర్చిన ఘటన చిల్లకూరు మండలం, కమ్మవారిపాలెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గ్రామంలో కాపురముంటున్న సుశీలమ్మ కొడుకు మద్యం తాగొచ్చాడని మందలించింది. ఈ నేపథ్యంలో ఆవేశంతో కత్తితో కుమారుడు తల్లి తల మీద నరికాడు. వెంటనే గూడూరు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మహిళ మృతి చెందింది. ఘటనపై చిల్లకూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.