News November 10, 2024
సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు రెండోసారి వరించిన పదవి
కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. 1982 నుంచి టీడీపీలో చేరిన ఆయన పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2016లో కుడా తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన సేవలను గుర్తించి రెండోసారి కుడా ఛైర్మన్‌గా నియమించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 8, 2024
బేతంచర్లలో ఇరు వర్గాల హిజ్రాల మధ్య ఘర్షణ
బేతంచెర్లలోని కొత్త బస్టాండు సమీపంలో ఆదివారం హిజ్రా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గం బేతంచర్లకు వచ్చి డబ్బువసూలు చేయకూడదని స్థానికులు వాగ్వాదానికి దిగారు. స్థానికుల సమాచారంతో బేతంచర్ల ఎస్సై రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఘర్షణ సద్దుమణిగింది.
News December 8, 2024
బనగానపల్లెలో టీచర్‌పై కేసు
ఓ ప్రైవేటు పాఠశాల టీచర్‌ను తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బనగానపల్లెలో శనివారం జరిగింది. మ్యాథ్స్ టీచర్ ధృవకుమార్ విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేస్తానని ఓ విద్యార్థిని వద్ద డబ్బు వసూలు చేసినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. అయితే దాంతో పాటు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసి పేరెంట్స్ చితకబాది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
News December 8, 2024
విద్యార్థులకు శ్లోక రూపంలో అవగాహన కల్పించిన కలెక్టర్
పిల్లల భవిష్యత్తు గుర్తించి పిల్లల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత తల్లితండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. బేతంచెర్ల మండలం RS రంగాపురం ZPH స్కూల్లో మాట్లాడుతూ.. సమాజంలో గౌరవింపబడాలంటే 5వ కారాలతో కూడిన ప్రవర్తన ఉండాలన్నారు. వస్త్రేనా వపుషా వాచా విద్య యా వినయైన చవ కారైహి పంచ బి ర్యుక్తఃన రో భవతి పండితః అని శ్లోక రూపంలో వివరించి భావం తెలిపారు.