News February 25, 2026

సోలార్‌ రుణాల మంజూరులో వేగం పెంచాలి: కలెక్టర్‌

image

‘పీఎం సూర్యఘర్‌ ముఫ్తీ బిజిలీ’ యోజన అమలులో అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి పురోగతి సాధించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న 600 రుణ దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 37 వేల దరఖాస్తులు అందగా, 7,320 నివాసాల్లో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తయిందని ఆమె వెల్లడించారు.

Similar News

News April 20, 2026

నిమ్మ.. ధర అదిరిందమ్మ

image

యాడికి మండలంలో నిమ్మకాయల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 1100 కాయలున్న బస్తా ధర రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. మండల పరిధిలోని దాదాపు 1000 ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇక్కడి దిగుబడి హైదరాబాద్, సిరిగొండ, హోస్పేట, బళ్లారి, హుబ్లీ వంటి నగరాలకు ఎగుమతి అవుతోంది. ఆశించిన లాభాలు వస్తుండటంతో సాగుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 20, 2026

జగిత్యాల: 1230 రోజుల తర్వాత ‘గులాబీ బాస్’ పర్యటన

image

దాదాపు 1230 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల పర్యటనకు రానున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పర్యటించిన ఆయన, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు నాంది పలుకుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ రాకతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

News April 20, 2026

సీఎం చంద్రబాబుపై సినిమా

image

AP: సీఎం చంద్రబాబు జీవితం, పరిపాలనా విశేషాలతో ‘ధర్మచక్రం’ సినిమాను నిర్మించినట్లు దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ వెల్లడించారు. CBN బర్త్ డే సందర్భంగా ఇవాళ 13 జిల్లాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న సేవలను, ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఇందులో వాస్తవాలను చూపించామని పేర్కొన్నారు.