News April 5, 2025
సోలార్ రూప్ టాప్పై అవగాహన కల్పించండి: కలెక్టర్ చేతన్

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10వేల రూప్ టాప్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
Similar News
News November 12, 2025
విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా: ధర్మారెడ్డి

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్నూ విచారించారు’ అని మీడియాకు తెలిపారు.
News November 12, 2025
కాణిపాక ఆలయానికి రూ.1.06 కోట్ల ఆదాయం

కాణిపాకంలో ఆన్లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలాలు బుధవారం నిర్వహించారు. ఈక్రమంలో దేవస్థానానికి మొత్తం రూ.1,06,99,997 ఆదాయం లభించింది. షాపింగ్ కాంప్లెక్స్, హోటల్ లైసెన్స్ హక్కు రూ.54.63 లక్షలు, పాదరక్షల భద్రపరుచుకునే హక్కు రూ.24.56 లక్షలు, వినాయక సదన్ హోటల్ లైసెన్స్ హక్కు రూ.27.10 లక్షలు, కళ్యాణమండపం షాపు హక్కు రూ.70 వేలు పలికిందని ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.
News November 12, 2025
కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

కొవ్వూరు మండలం అరికిరేవుల వద్ద బుధవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరంలోని పిడుగుకు చెందిన వెంకటరమణ(50) మరణించారని సీఐ విశ్వ తెలిపారు. బైక్పై కొవ్వూరు నుంచి తాళ్లపూడికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


