News February 3, 2025

సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు వద్దు: ఎస్పీ

image

వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఈనెల 28 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని అన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, రాజకీయ నాయకుల, కుల మతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News October 17, 2025

కేయూలో లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ

image

కేయూ బాటనీ విభాగం అధిపతితో పాటు నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు, నలుగురు నాన్ టీచింగ్ ఉద్యోగులకు షోకాజ్ నోటీస్లు జారీ చేసినట్లు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు. ఇటీవల వీసీ ప్రతాప రెడ్డి బాటనీ విభాగాన్ని తనిఖీ చేయగా ఆ విభాగ అధిపతితో సహా నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు, మరో నలుగురు నాన్ టీచింగ్ ఉద్యోగులు విధుల్లో లేరనే విషయం వెల్లడైందన్నారు. దీంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

News October 17, 2025

దీపావళి రోజు ఏం చేయాలంటే?

image

దీపావళి ముందురోజే ఇంటిల్లిపాది నూనెతో అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘పండుగరోజు ఉదయమూ తలస్నానం చేయాలి. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి దీపావళికి తప్పకుండా అమ్మవారిని పూజించాలి. సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు వేయాలి. దీపాలు వెలిగించి, అమ్మవారికి షడ్రుచులతో వంటకాలు నివేదించాలి. పూజ పూర్తయ్యాక ఆ దీపాలను ఇంటి ముందు, తులసి కోట వద్ద అలంకరించుకోవాలి’ అని చెబుతున్నారు.

News October 17, 2025

HUDCOలో 79 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) 79 మేనేజర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్, CA/CMA, LLB, LLM, MBA, PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hudco.org.in/