News February 12, 2025
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు: SP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362914399_51550452-normal-WIFI.webp)
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాను ఐటి పోలీసులు పరిశీలిస్తూ ఉంటారని చెప్పారు.
Similar News
News February 13, 2025
రాజాం : తండ్రిని చూసేందుకు వెళ్లి దారిలో మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739412415796_1100-normal-WIFI.webp)
రాజాం కాంప్లెక్స్ ఆవరణలో కాలువలో బుధవారం మెరకముడిదాంకి చెందిన మజ్జి రామకృష్ణ మృతి చెందిన విషయం <<15436428>>తెలిసిందే<<>>. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు రామకృష్ణ రాజాం వచ్చాడు. కాంప్లెక్స్‌లో బైక్ ఉంచి బస్సులో వెళ్లాడు. రాత్రి తిరిగి కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. ఈక్రమంలో గుండెపోటు వచ్చి కాలువలో పడిపోగా ఎవరు చూడకపోవడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
News February 13, 2025
కాసేపట్లో మోదీ, ట్రంప్ కీలక భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739412239144_367-normal-WIFI.webp)
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. వలస విధానం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల తరలింపు, ట్రేడ్, టారిఫ్స్, విదేశాంగ విధానాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే భారత్ ఖరీదైన బైకులపై టారిఫ్స్ తగ్గించింది. ఈ పర్యటన తర్వాత మరిన్ని దిగుమతులపై టారిఫ్ తగ్గించే అవకాశం ఉంది.
News February 13, 2025
MBNR: ‘స్థానిక ఎన్నికల్లో ఆర్వోలది పాత్ర కీలకం’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739412400802_11055407-normal-WIFI.webp)
పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో ముసాయిదాబేగం అన్నారు. నిన్న జడ్పీ ఆఫీసులో ROలు, AROలకు శిక్షణ నిర్వహించారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఆర్వోలది క్రియాశీలక పాత్ర అన్నారు.ఎన్నికల నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు.