News February 12, 2025
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు: SP

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాను ఐటి పోలీసులు పరిశీలిస్తూ ఉంటారని చెప్పారు.
Similar News
News March 26, 2025
జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్

జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈరోజు సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. మున్సిపల్ పట్టణాలు మండల కేంద్రాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వాహనాలు పత్రాలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
News March 26, 2025
వాట్సాప్, గూగుల్ మ్యాప్స్‌తో దొంగడబ్బు కనిపెట్టిన Income Tax

ఎగవేతదారులు, బినామీలు, దాచిన డబ్బు, క్రిప్టో అసెట్స్‌ను గుర్తించడానికి Income Tax సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వాట్సాప్, ఇన్‌స్టా, గూగుల్ మ్యాప్స్‌ను విశ్లేషించి వాటిని కనిపెట్టేస్తోంది. ఎగవేసిన ₹200CRను WA ఎన్‌క్రిప్టెడ్ మెసేజుల ఆధారంగా గుర్తించిన వైనాన్ని పార్లమెంటులో FM నిర్మల వివరించారు. G Maps ద్వారా డబ్బు దాచిన చోటు, Insta ద్వారా బినామీ ప్రాపర్టీ ఓనర్‌షిప్‌ను కనిపెట్టామని తెలిపారు.
News March 26, 2025
జుక్కల్: పదో తరగతి ప్రశ్నలు లీక్

పదో తరగతి గణిత పరీక్షకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు లీకైన ఘటన జుక్కల్‌లోని ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ఓ విద్యార్థి గణితం ప్రశ్నలు పేపర్‌పై రాసి బయటకు పారేశాడు. ఈ లీకైన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం వెలుగులోకి రావడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, DEO రాజు పరీక్ష కేంద్రానికి చేరుకొని ఘటనపై విచారణ చేస్తున్నారు.