News November 17, 2024

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డిపై కేసు నమోదు

image

సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి శ్రీరెడ్డిపై నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరనాయక్ చెప్పారు. 

Similar News

News December 9, 2024

తాడేపల్లిలో మహిళపై అత్యాచారయత్నం 

image

తాడేపల్లిలో ఓ మహిళపై ఆదివారం రాత్రి అత్యాచారయత్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తన కుమారుడి స్నేహితుడు రామారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో సదరు మహిళ భయంతో మాజీ CM జగన్ హెలీప్యాడ్ వైపు పరుగులు తీసింది. స్థానికుల సహాయంతో ఆ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

News December 9, 2024

పల్నాడు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!

image

పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.

News December 9, 2024

ఎన్జీవో కాలనీలో NTR విగ్రహావిష్కరణ చేసిన పెమ్మసాని

image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎన్జీఓ కాలనీలో ఆదివారం సాయంత్రం టీడీపీ వ్యవస్థాపకుడు NTR విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గళ్ళా మాధవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.