News March 29, 2024
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు: ఎస్పీ రాహుల్ హెగ్డే
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని విద్వేషకర పోస్టులు పెట్టే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Similar News
News January 22, 2025
NLG: స్కాలర్ షిప్ దరఖాస్తులకు మరో ఛాన్స్
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ల కొరకు ఈపాస్ అన్లైన్‌లో ఇంకనూ ధరఖాస్తు చేయని బీసీ, EBC విద్యార్ధులు మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నాజిమ్ అలీ అప్సర్ ఒక ప్రకటనలో కోరారు. ఈపాస్ వెబ్సైట్ ద్వారా తమ కళాశాల విద్యార్థుల వివరాలను ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లు నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
News January 22, 2025
మానవత్వం చాటుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే ‘వేముల’
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల మరోసారి మానవత్వం చాటుకున్నారు. నకిరేకల్ మండలం కడపర్తిలో బుధవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభకు హజరైన ఆయనకు ఓ మహిళ పెన్షన్ రావడంలేదని తెలిపింది. ఏడేళ్ల నుంచి నరాల వ్యాధితో బాధపడుతున్న తన భర్త సత్తయ్యకు పెన్షన్ రావడం లేదని గంగమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్లింది. పెన్షన్ మంజూరు అయ్యేంతవరకు తానే సొంత డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు అందించారు.
News January 22, 2025
ఎంజీయూ డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్‌ల ఫలితాలను ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 6300 మంది విద్యార్థులకు గాను 1338 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 3వ సెమిస్టర్‌లో 4509 మందికి గాను 1569 మంది, 5వ సెమిస్టర్‌లో 5378 మందికి గాను 2380 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సీఓజీ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.