News April 1, 2025
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం: SP

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించి తప్పుడు వదంతులు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని SP అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. కుల, మత, రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
Similar News
News April 24, 2025
పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 10 సెంటర్లు: డీఆర్‌వో

పాలీసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డీఆర్‌వో మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో డీఆర్‌వో పాలిసెట్-2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లు, సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 30న జరగనున్న పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 18 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News April 23, 2025
పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఐదుగురికి అస్వస్థత

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై ప్రమాదం సంభవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
News April 23, 2025
ప.గో : టెన్త్ రిజల్ట్స్..17,695 మంది పాస్

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప.గో.జిల్లాలో మొత్తం 21,539 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 17,695 మంది పాసయ్యారు. 10,924 మంది బాలురు రాయగా 8,612 మంది పాసయ్యారు.10,615 మంది బాలికలు పరీక్ష రాయగా 9,083 మంది పాసయ్యారు. 82.15 పాస్ పర్సంటేజ్ తో పశ్చిమగోదావరి జిల్లా 16 వ స్థానంలో నిలిచింది.