News March 21, 2024
సోషల్ మీడియాలో పోస్టు.. కురుపాం ఎంఎన్ఓ సస్పెన్షన్
కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎంఎన్ఓగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ కిరణ్ కుమార్ను సస్పెండ్ చేసినట్లు ఇన్ఛార్జ్ డీఆర్ఓ జి.కేశవ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టులను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసినందుకు గాను కిరణ్ కుమార్ను సస్పెండ్ చేశామన్నారు. ఈ మేరకు కలెక్టర్& జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News December 29, 2024
నూర్పిడి యంత్రం బోల్తా.. బాలుడి మృతి
బొబ్బిలి మండలంలోని మహారాణితోట సమీపంలో ఉన్న పొలంలో నూర్పిడి యంత్రం బోల్తాపడి సాలపు మణికంఠ(14) మృతి చెందారు. బాలుడు తల్లిదండ్రులు శంకర్, పొలమ్మ నూర్పిడి కూలీ పనికి వెళ్లగా తల్లిదండ్రులతో ఇద్దరు కుమారులు వెళ్లారు. నూర్పిడి అయిపోవడంతో యంత్రంపైకి ఎక్కవద్దని తల్లిదండ్రులు చెప్పినప్పటికి వినకుండా మణికంఠ, తమ్ముడు పార్థు, మరో అబ్బాయి ఎక్కారు. బోల్తా పడడంతో ఇద్దరు దూరంగా తుల్లగా మణికంఠ కిందపడి మరణించాడు.
News December 29, 2024
VZM: ‘కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సర్వం సిద్ధం’
జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు PMT, PET పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని రకాలైన ఏర్పాట్లును పూర్తి చేసినట్లుగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నియామకాల ప్రక్రియలో భాగంగా జిల్లాలో 9,152 మంది అభ్యర్థులకు రేపటి నుంచి జనవరి 22 వరకు పోలీసు పరేడ్ గ్రౌండ్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సీసీ కెమోరాల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.
News December 29, 2024
VZM: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే ఈ కుంభమేళాకు ఉమ్మడి విజయనగరం జిల్లా మీదుగా రెండు రైళ్లు నడవనున్నాయి. తిరుపతి-బనారస్-తిరుపతి (కుంభమేళా), నరసాపూర్-బనారస్-నరసాపూర్ (కుంభమేళా) స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.