News November 18, 2024
సోషల్ మీడియాలో సైతం మద్యం వ్యాపారాలు: దేవినేని అవినాశ్
విజయవాడలో మద్యం డోర్ డెలివరీ చేస్తామంటూ ఇటీవల ఓ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై YCP NTR జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం డోర్ డెలివరి చేస్తామంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో ఏకంగా సోషల్ మీడియాలో సైతం వాపారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం గడప వద్దేకే సంక్షేమం అందిస్తే.. కూటమి ప్రభుత్వం గడప వద్దకే మద్యం అందించి మత్తులో ఉంచుతోందన్నారు.
Similar News
News December 4, 2024
రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సన్నద్ధం చేస్తున్నాం: కలెక్టర్
ఈనెల 6 నుండి జిల్లాలో రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ జి. లక్ష్మిశ తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేలా ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రజలకు ముందుగానే తెలియపరిచేలా సదస్సుల షెడ్యూల్‌ను కరపత్రాల రూపంలో ముద్రించామన్నారు.
News December 4, 2024
ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి
ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో రహదారి వెంబడి ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతుతో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో కొంత ఇబ్బంది కలిగిందని, రైతులు భయపడవద్దని ఆయన తెలిపారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోతే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు.
News December 4, 2024
కృష్ణా: బీ-ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల
కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సు(Y17 నుంచి Y23 బ్యాచ్‌లు) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను 2025 జనవరి 28 నుండి నిర్వహిస్తామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 13లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని కోరింది.