News February 5, 2025

సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

జిల్లా ప్రజలందరూ సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. తన కార్యాలయం నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలను వాట్సప్ ఛానల్ ద్వారా అప్రమత్తం చేస్తూనే ఉంటుందని తెలిపారు. మా ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమాలను వీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News December 2, 2025

DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్

image

రవాణా వాహనాలకు కేంద్రం ఫిట్‌నెస్ <<18321648>>ఛార్జీలు<<>> పెంచడంపై సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(SIMTA) కీలక నిర్ణయం తీసుకుంది. DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది. AP, TN, TG, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది.

News December 2, 2025

ఉస్మానియా పార్కులో రాజాపూర్ విద్యార్థి ఆత్మహత్య

image

శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రెడ్డి విజ్ఞాన్ తేజ (19) ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న విజ్ఞాన్ తేజ, సోమవారం రాత్రి ఉస్మానియా ఆక్సిజన్ పార్కులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరినట్లు గ్రామస్థులు తెలిపారు.

News December 2, 2025

రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు ఇన్వైట్ చేయనున్నారు.