News March 20, 2024
సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా: తూ.గో ఎస్పీ

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తూ.గో జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీశ్ హెచ్చరించారు. ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉందని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఆయా వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూప్స్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. SHARE IT..
Similar News
News February 23, 2026
కల్తీ పాల ఘటన.. నరసాపురంలో ఉన్నతాధికారుల పర్యటన

రాజమండ్రిలో నమోదైన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్ సోమవారం పర్యటించారు. తాగునీరు, పాలు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.
News February 23, 2026
భయపడకండి.. ప్రభుత్వం అండగా ఉంది: మంత్రి దుర్గేశ్

రాజమండ్రిలో ప్రజలను కలవరపెడుతున్న అనూరియాపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితిపై సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.
News February 23, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై YS షర్మిల సీరియస్!

రాజమండ్రిలో కల్తీ పాల వల్ల నలుగురు మృతి చెందడంపై సోమవారం పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.


