News November 15, 2024

సౌత్ సెంట్రల్ రైల్వేఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం

image

మెట్టుగూడ రైల్వే మెకానిక్ వర్క్ షాప్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయాన్ని హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఆడెం సంతోశ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే యూనియన్ నేతలు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 29, 2025

శాతవాహన ఎక్స్‌ప్రెస్.. జనగాంలో అదనపు స్టాప్

image

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగాం స్టేషన్‌లో అదనపు స్టాప్ ప్రకటించింది. ప్రయోగాత్మకంగా అక్టోబర్‌ 30, 2025 నుంచి అమల్లోకి రానుంది. విజయవాడ- సికింద్రాబాద్‌ ఉ.10:14, సికింద్రాబాద్- విజయవాడ సా.17:19కి జనగాం చేరుకొని, నిమిషం పాటు వెయిట్ చేస్తుందని పేర్కొంది.

News October 29, 2025

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మొబైల్స్, ఈ-సిగరేట్స్ సీజ్

image

శంషాబాద్ విమానాశ్రయంలో అరైవల్ ర్యాంప్ వద్ద గుర్తుతెలియని యాష్ కలర్ హ్యాండ్‌బ్యాగ్ వదిలి వెళ్లారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ వెంటనే SOCCకి సమాచారం అందించింది. తక్షణమే BDDS బృందం ఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు నిర్వహించి బ్యాగ్‌ సురక్షితమని ప్రకటించింది. బ్యాగ్‌‌లో మొబైల్ ఫోన్లు,ఈ- సిగరెట్లు లభించాయి. మొత్తం విలువ సుమారు ₹12.72 లక్షలని తెలిపారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

News October 29, 2025

HYD: వేగంగా డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ పనులు

image

సికింద్రాబాద్‌లో డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మట్టి పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. బేగంపేట విమానాశ్రయం సమీపంలో 600 మీటర్ల సొరంగం నిర్మాణం ప్రణాళికలో ఉంది. రూ.1,550 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే NH-44 రహదారి ట్రాఫిక్ సమస్యలు తగ్గి ఉత్తర తెలంగాణతో రవాణా మరింత సులభం కానుందని అధికారులన్నారు.