News November 15, 2024

సౌత్ సెంట్రల్ రైల్వేఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం

image

మెట్టుగూడ రైల్వే మెకానిక్ వర్క్ షాప్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయాన్ని హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఆడెం సంతోశ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే యూనియన్ నేతలు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 10, 2024

HYD: రాహుల్, ప్రియాంక గాంధీని కలిసిన సీతక్క

image

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన మంత్రి సీతక్క, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ఇటీవల వయనాడ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

News December 10, 2024

HYD: విజయవంతంగా ప్రజా విజయోత్సవాలు పూర్తి: సీఎస్

image

ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.

News December 10, 2024

REWIND: ట్యాంక్‌బండ్‌లో విషాద గాథ తెలుసా?

image

సాగర్‌లో బుద్ధుడి విగ్రహ ప్రతిష్ఠలో పెను విషాదం జరిగింది. 1990 మార్చి 10న విగ్రహాన్ని HYDకు తీసుకొచ్చారు. పెద్ద పడవలో ఎక్కించి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా అది కుదుపునకు గురైంది. విగ్రహం మెల్లిగా నీటిలోకి జారిపోవడంతో పడవలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక విగ్రహాన్ని వెలికితీసే సాహసం చేయలేదు. 1992లో నాటి CM కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి చొరవ చూపి డిసెంబర్‌ 1992లో వెలికి తీసి ప్రతిష్ఠించారు.