News January 29, 2025
సౌదీలో రోడ్డు ప్రమాదం.. మెట్పల్లి వాసీ మృతి

సౌదీలో రోడ్డు ప్రమాదంలో మెట్పల్లిలోని రేగుంటకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. కాపెల్లి రమేశ్ (30) మూడు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. విధులకోసం మినీ బస్సులో ప్రయాణిస్తుండగా.. ప్రమాదవశాత్తు బస్సు ఢీకొన్నాయి. ఇందులో 15 మంది చనిపోయారు. ఇందులో కాపెల్లి రమేశ్ ఉన్నారు. ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన మరోముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News September 17, 2025
సిరిసిల్ల: నిస్వార్థ నాయకుడు అమృతలాల్ శుక్లా

అమృతలాల్ శుక్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. తొలుత ఉపాధ్యాయ వృత్తిని వదిలి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడారు. సామాన్య ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడారు. పేదల కోసం భూ పంపిణీ ఉద్యమాలు, వెట్టిచాకిరి నిర్మూలన కోసం కృషి చేశారు. ఆయన ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారు. 1957లో సిరిసిల్ల MLA గా అమృతలాల్ ఎన్నికయ్యారు.
News September 17, 2025
తుంగతుర్తి: తెగువ చూపి విప్లవాన్ని రగిల్చారు..

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దళ నాయకుడిగా పనిచేసి తెగువతో విప్లవాన్ని రగిలించిన నేత భీంరెడ్డి నర్సింహారెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, సామాజిక న్యాయం కోసం, పేదల బతుకులు బాగు చేసేందుకు ఆయన పోరాడారు. ఆకలిదప్పులు, అసమానతలులేని సమసమాజం నిర్మించాలని పరితపించేవారు. మచ్చలేని పార్లమెంట్ సభ్యుడిగా గడిపిన ఆయన జీవితం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
News September 17, 2025
HYD: దక్కన్ రేడియోలో నిజాం ఏం చెప్పారంటే?

‘నా ప్రియమైన ప్రజలారా హమ్ నే భారత్కే సదర్ గవర్నర్ జనరల్ రాజగోపాల చారి గారికి పంపుతున్న సందేశం ఏమిటంటే.. నా రాజీనామా సమర్పించడంతోపాటు రజాకారులను నిషేధించమని కోరుతూ HYD సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం. ఇకనుంచి ఇక్కడి ప్రజలు భారత ప్రజలతో కలిసి కులమతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో భేద భావాలు లేకుండా సామరస్యంగా ఒకే తాటిపై జీవించాలని కోరుతున్నా’ అని ప్రసంగించారు.