News June 6, 2024
సౌదీ అరేబియాలో చినవంక యువకుడి మృతి

వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని చినవంక గ్రామానికి చెందిన మదనాల శంకర్ (32) సౌదీ అరేబియాలో మృతి చెందారు. అతను బుధవారం తెల్లవారుజామున మెదడు పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 4 నెలల క్రితం పని నిమిత్తం ఆతను సౌదీ వెళ్లినట్లు చెప్పారు. ఇటీవల శంకర్ తల్లి కాంతమ్మ కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఎదిగొచ్చిన కొడుకు చిన్న వయసులోనే చనిపోవడంతో తండ్రి సూర్యనారాయణ కన్నీరు మున్నీరయ్యారు.
Similar News
News November 20, 2025
శ్రీకాకుళం జిల్లాలో రూ.25 వేల జీతంతో ఉద్యోగాలు

శ్రీకాకుళంలో రేపు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాకు చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీలు హాజరుకానున్నాయి. టెన్త్-డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారు శ్రీకాకుళం, నరసన్నపేటలో పని చేయాలని, రూ.15,000-25,000 జీతం ఇస్తారని ఆ శాఖాధికారి సుధా చెప్పారు. దరఖాస్తుకు https://WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
News November 19, 2025
ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.