News February 26, 2025
సౌర నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి: కలెక్టర్

మడకశిర, కదిరి ప్రాంతాలలో సౌర నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ సమావేశం నిర్వహించారు. 2025-26 ఏడాదికి సంబంధించి జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. కంపెనీ అవసరాలకు అనుగుణంగా యువ నిపుణులను గుర్తించాలన్నారు.
Similar News
News July 8, 2025
10న చిత్తూరు జిల్లాలో PTM

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.
News July 8, 2025
ప్రజాస్వామికంగా చర్చలు జరపాలి: పొన్నం

TG: పదేళ్లు అధికారంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గతంలోని పథకాలను కొనసాగిస్తూ అదనపు పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. చర్చలు ప్రజాస్వామికంగా ఉంటూ ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేయట్లేదని, స్పీకర్‌కు లేఖ రాసి <<16988692>>చర్చకు<<>> రావాలన్నారు. చర్చ జరిగితే ఎవరేంటో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.
News July 8, 2025
ఉమ్మడి NZB జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అజ్మత్ హుస్సేన్

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగాల్సి ఉండగా అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సన్నదమవుతుంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్లను సోమవారం నియమించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత అజ్మత్ ఉల్లా హుస్సేన్‌ను నియమించింది. ఈయన ప్రస్తుతం తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్‌గా ఉన్నారు.