News September 29, 2024
సౌర విద్యుత్‌పై అవగాహన కల్పించాలి: VZM జేసీ
ప్రతీ ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకొనే విధంగా వినియోగదారులను చైతన్యపరచాలని జేసీ ఎస్.సేతుమాధవన్ కోరారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం అమలుపై శనివారం సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా పథకం అమలును సమీక్షించారు.
Similar News
News November 24, 2024
IPL వేలంలో మన విజయనగరం కుర్రాడు
ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్లో రాణిస్తున్నాడు. మన జిల్లా వాసిగా యశ్వంత్ ఐపీఎల్‌కు ఎంపిక కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 24, 2024
VZM: ఒంటరితనం భరించలేక మహిళ సూసైడ్
బాడంగి మండలం కోడూరు పంచాయతీకి చెందిన గౌరమ్మ(55) శనివారం మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గౌరమ్మ భర్త కొంతకాలం క్రితం మృతిచెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరితనంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఈనెల 14న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. మృతురాలి అన్నయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News November 24, 2024
విజయనగరంలో టుడే టాప్ న్యూస్
➤విజయనగరం-కోరుకొండ మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి ➤విజయనగరంలో భారీగా పట్టుబడ్డ నిషేధిత ప్లాస్టిక్ ➤జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ ➤తహసీల్దార్ కార్యాలయాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ప్రచురణ ➤అదానీ అరెస్ట్ చేయాలని ఉమ్మడి జిల్లాలో సీపీఐ, సీపీఎం నేతల నిరసన ➤విజయనగరంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు➤జిల్లాలో 3,425 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు