News September 29, 2024
సౌర విద్యుత్‌పై అవగాహన కల్పించాలి: VZM జేసీ
ప్రతీ ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకొనే విధంగా వినియోగదారులను చైతన్యపరచాలని జేసీ ఎస్.సేతుమాధవన్ కోరారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం అమలుపై శనివారం సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా పథకం అమలును సమీక్షించారు.
Similar News
News October 5, 2024
VZM: నేషనల్ టీంకు ఎంపికైన వ్యవసాయ కూలీ కొడుకు
అక్టోబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న నేషనల్ ఫుట్ బాల్ గేమ్స్‌కు కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన చింతాడ రాజేశ్ ఎంపికయ్యాడు. గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాజేవ్ ఏపీ టీం తరఫున జాతీయస్థాయి ఆడనున్నాడు. గతంలో 3 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తండ్రి అప్పారావు, తల్లి లక్ష్మీ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.
News October 4, 2024
VZM: పైడితల్లి హుండీ ఆదాయం రూ.10.54 లక్షలు
శ్రీ పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయం గత 29 రోజులకు గాను రూ.10,54,690, బంగారం 125.100 గ్రాములు వచ్చింది. గురువారం రెండు ఆలయాల హుండీలను అమ్మవారి కళ్యాణ మండపంలో లెక్కించారు. వెండి 131 గ్రాములు వచ్చినట్లు ఈవో ప్రసాదరావు తెలిపారు. హుండీ లెక్కింపులో పాత రూ.2వేల నోట్లు, రూ.500 నోట్లు, నకిలీ నోట్లు దర్శనమిచ్చాయి. హుండీలో ఇలాంటి నోట్లు వేయకూడదని ఈవో సూచించారు.
News October 4, 2024
VZM: పవన్ ప్రసంగం కోసం LED స్క్రీన్
పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రసంగాన్ని కోట జంక్షన్‌లో గురువారం రాత్రి LED స్క్రీన్ ద్వారా ప్రజలు వీక్షించారు. తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, అవనాపు భావన దంపతులు భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు, జనసైనికులు, నాయకులు ప్రత్యక్షంగా తిలకించారు.