News July 13, 2024
‘స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోండి’

2024 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్య కోసం క్రైస్తవ మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించనుంది. అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా ఈనెల 8 నుండి ఆగస్టు 7లోపు అప్లై చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి కే సంజీవరావు ప్రకటించారు. అప్లై చేసిన కాపీలను రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆగస్టు 27 లోపు జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
Similar News
News November 28, 2025
కులాలు, మతాల మధ్య రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించబోం: ఖమ్మం సీపీ

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను సీపీ సునీల్ దత్ ఆదేశించారు. కులాలు, మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించడం జరగదని హెచ్చరించారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
News November 28, 2025
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై టోల్ ఫ్రీ నెంబర్: కలెక్టర్

ఖమ్మం: ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1077ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ పట్ల ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లు ముగిసి అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ప్రలోభాలు పెరిగే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో బృందాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
News November 28, 2025
‘ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి ఆస్కారం ఇవ్వొద్దు’

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛ, న్యాయబద్ద నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు అన్నారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్‌తో కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల పరిశీలకులు సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి ఆస్కారం ఇవ్వవద్దని పేర్కొన్నారు.


