News July 17, 2024
స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి
అనంతపురం జిల్లాలో దివ్యాంగులైన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల జిల్లా ఏడీ అబ్దుల్ రసూల్ తెలిపారు. 9,10వ తరగతులు, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఆపై చదువుతున్న దివ్యాంగులు www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 9,10 విద్యార్థులు ఆగస్టు 31, ఇంటర్ ఆపై విద్యార్థులు అక్టోబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 12, 2024
వీరుడికి కన్నీటితో సెల్యూట్
జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ సుబ్బయ్య (45)కు నార్పలలో అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. పోలీసులు, బంధువులు, ప్రజల అశ్రునయనాల మధ్య వారి సొంత వ్యవసాయ పొలంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భార్య, కుమారుడు, కుమార్తె భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.
News December 12, 2024
వీర జవాన్ కుటుంబ సభ్యులకు బండారు శ్రావణి పరామర్శ
జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) భౌతికకాయానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాళి అర్పించారు. భౌతికకాయాన్ని అధికారులు నిన్న రాత్రి నార్పలకు తీసుకురాగా ఆమె సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
News December 12, 2024
అక్రమ మద్యం వ్యాపారికి మూడేళ్లు జైలు శిక్ష
గోరంట్ల మండలం ముద్దులకుంట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి 2021లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా సీఐ జయనాయక్ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. కోర్టు సుదీర్ఘ విచారణ చేసి నేరం రుజువు కావడంతో ముద్దాయికి మూడేళ్లు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు.