News July 6, 2024

స్టడీ టూర్‌లో మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

image

నల్లమలను టూరిజం హబ్‌గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయం రంగాపూర్ నిరంజన్ షావలీ దర్గాలో మంత్రులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం 75వ వన మహోత్సవంలో భాగంగా వారు మొక్కలు నాటారు.

Similar News

News December 30, 2024

కల్వకుర్తి‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి యువకులు మృతి

image

కల్వకుర్తిలోని కొత్త కాటన్ మిల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌పై కల్వకుర్తి వైపు వస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణానికి చెందిన శ్రీనాథ్ (17), భాను (16)గా గుర్తించారు. మృతులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News December 30, 2024

వనపర్తి: ‘లిఫ్ట్ ఇరిగేషన్ సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు విడుదల’

image

కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన విద్యుత్‌ ఉప కేంద్రాన్ని వెంటనే మంజూరు చేయాలని గతంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 63 లక్షల మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో RT నంబర్ 345 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

News December 30, 2024

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల జిల్లా యువకుడు

image

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండంలోని బింగిదొడ్డి గ్రామానికి చెందిన వేణు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. తనకు సహకారం అందించిన కోచ్, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన యువకుడిని గ్రామస్థులు అభినందించారు.