News April 16, 2025
స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక ఉంచాలి: ఇన్ఛార్జి కలెక్టర్

జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లభ్యత ఉండేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి గనుల శాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాల్లో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం ఇన్ఛార్జి కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు అందించాలన్నారు.
Similar News
News April 20, 2025
KMM: పేరెంట్స్ మందలించారని యువకుడి SUICIDE

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి(M) శంకరగిరి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు(24) ఏ పని చేయకుండా కాళీగా ఉంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.
News April 20, 2025
బోధన్ డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదంపై సబ్ కలెక్టర్ ఆరా

బోధన్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. మంటలను అదుపు చేసి, వీలైనంత త్వరగా ఆర్పడానికి తక్షణ అవసరమైన చర్యలు, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్తో వెంకట నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
News April 20, 2025
నెల్లూరు: హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య ఆదివారం బుల్లెట్ వాహనంపై పర్యటించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. ధనలక్ష్మిపురం, నారాయణ మెడికల్ కాలేజ్ రోడ్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి శానిటేషన్ సెక్రటరీలకు సూచనలు చేశారు. కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఆదివారం కూడా పనికి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గకుండా చూడాలని ఆదేశించారు.