News July 13, 2024
స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం.. పురిటిలో శిశువు మృతి

స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యంతో ఓ గర్భిణి పురిటిలో శిశుమృతి చెందిన ఘటన శనివారం తల్లాడ మండలంలో జరిగింది. మల్లారంకి చెందిన గర్భిణి లావణ్యకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం PHCకి భర్త తీసుకెళ్లాడు. వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్‌ను డెలివరీ చేయాలని భర్త కోరారు. దీంతో నర్సు సెల్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం వహించింది. శిశువు కడుపులో ఉమ్మ నీరుతాగి మరణించింది.
Similar News
News February 18, 2025
ఖమ్మం: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పెండింగ్ లేకుండా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.
News February 17, 2025
ఖమ్మం: KCRపై అభిమానం అదుర్స్

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కస్నాతండాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిర్చి రైతులు వినూత్నంగా మిరప కల్లంలో హ్యాపీ బర్త్ డే కేసీఆర్ అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైతు లక్న్మయ్య తన మిర్చి కల్లాంలో కేక్ కట్ చేసి కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
News February 17, 2025
ఖమ్మం: ‘మా చెవుల్లో పూలు పెడుతున్నారు’

పాలకులు ఏదో ఒక సాకు చెబుతూ తమ చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ఖమ్మం జిల్లా జర్నలిస్టులు ఎద్దేవా చేశారు. సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో చెవుల్లో పూలు పెట్టుకుని వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగే వరకు ఏదో ఒక రూపంలో నిత్యం నిరసనలు తెలుపుతూనే ఉంటామని, ఇందుకు అన్ని జర్నలిస్టు సంఘాలు ముందుకొచ్చేలా కృషి చేస్తామని వారు ప్రతిన బూనారు.